ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అందుబాటులో కోర్సులు, ప్లేస్​మెంట్ - 'ఈనాడు, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ' సంయుక్త సదస్సు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 12:30 PM IST

Updated : Nov 24, 2023, 2:04 PM IST

students_choosing_right_courses_on_seminar_in_kakinada

Students Choosing Right courses On Seminar In Kakinada: చాలా మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎంచుకోవాల్సిన కోర్సులపై సరైన అవగాహన ఉండదు. అందుకోసమే ఈనాడు- కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో దశ-దిశ అవగాహన సదస్సు కార్యక్రమం కాకినాడలో నిర్వహించారు. పట్టణంలోని సాంబమూర్తి నగర్​లోని వీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు శ్రీచైతన్య విద్యాసంస్థల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్లు మూర్తి, షణ్ముఖరావు... ఇంటర్మీడియట్ తర్వాత అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సులు గురించి విద్యార్థులకు వివరించారు. 

కేఎల్ యూనివర్సిటీలోని అందుబాటులో ఉన్న కోర్సులు, సదుపాయాలు,ప్లేస్​మెంట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇంఛార్జ్ చంద్రశేఖర్ ప్రసాద్ సదస్సు ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు. సదస్సులో ప్రతిభావంతులైన విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీ తరపున బహుమతులు అందించారు. ఈ సదస్సులో శ్రీచైతన్య విద్యాసంస్థల ఏజీఎంలు చిన్మయ శ్రీనివాస్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated :Nov 24, 2023, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details