ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికార పార్టీ అండతో సహజ వనరులు యథేచ్ఛగా దోపిడీ- టన్నులకొద్ది ఇసుక తరలింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 12:49 PM IST

sand_illegal_exploitation

Sand Illegal Exploitation by Ruling Party Leaders:అధికార పార్టీ నాయకుల కళ్లు సహజ వనరులపై పడ్డాయి. తమ వెనుక ప్రజా ప్రతినిధులు ఉన్నారంటూ చోటామోటా నాయకుల యథేచ్ఛగా దోపిడీలు సాగిస్తున్నారు. వారి అక్రమాలకు అడ్డులేకుండాపోయింది. మట్టి, ఇసుక సహజ వనరులను అక్రమంగా తరిలిస్తున్నారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని తాండవ జలాశయం దగ్గరున్న మట్టిని.. యంత్రాలతో అర్ధరాత్రి వేళ వందలాది ట్రాక్టర్ల మట్టిని దోచేస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు స్థానిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. 

చోడవరంలోని పెద్దేరు జలాశయంలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా టన్నులకొద్ది ఇసుక దోచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సాగునీటి వనరులు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే అల్ప వర్షాలతో అల్లాడుతున్న రైతన్నలు సహజ వవరుల దోపిడీ వ్యవహారం.. గోరుచుట్టుపై రోకలి పోటులా తయారైందని వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పాలకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే భవిష్యత్తులో విలువైన సంపద కనుమరుగైపోయే ప్రమాదం ఉందని పలువురు పెదవి విరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details