ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Samara Shankaravam with Agri Gold Victims: 15న అగ్రిగోల్డ్‌ బాధితులతో.. విజయవాడలో సమర శంఖారావం: ముప్పాళ్ల నాగేశ్వరరావు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 5:56 PM IST

Agri_ Gold_ Victims

Samara Shankaravam with Agri Gold Victims on 15th in Vijayawada: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో.. అగ్రిగోల్ట్‌ బాధితులకు వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తానన్న సీఎం జగన్‌.. మాట తప్పారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతకల్లు సీపీఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల సమర శంఖారావం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కుతున్న సీఎం జగన్‌.. రూ. 3 వేల కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లిస్తే 60వేల కుటుంబాల కష్టాలు తీరుతాయన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలలలోగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్న జగన్ సర్కార్.. ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమర శంఖారావం అనేది ఏ రాజకీయ పార్టీలకు చెందిన సభ కాదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు అన్ని రాజకీయ పక్షాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆహ్వానించామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ఈ ఉద్యమం తీవ్రతరం కాకముందే అగ్రిగోల్డ్ డిపాజిట్​దారులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే డిసెంబర్‌ నుంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

ABOUT THE AUTHOR

...view details