ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Purandeswari Comments on AP Liquor Policy : 'మద్య నిషేధం హామీ ఏమైంది..? లిక్కర్ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 12:38 PM IST

Purandeswari Comments on AP Liquor

Purandeswari Comments on AP Liquor: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి... ఏపీ మద్యం పాలసీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయో వివరాలను బయటపెట్టారు. ప్రభుత్వం ఆయా కంపెనీల వివరాలను చెప్పడం లేదు కాబట్టే తాము చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కంపెనీల పేర్లు బయటపెట్టాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు నమోదయ్యాయని.. అందులో 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని వెల్లడించారు. 

వైఎస్ జగన్ అధికారంలోకి  రాకముందు దశలవారీ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారని.. మద్యం తయారీదారులు, విక్రయదారులను జైలుకు పంపుతామన్నారని.. ఇక ఇప్పుడు తామే తయారీదారుల జాబితా విడుదల చేశాం కాబట్టి ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలని నిలదీశారు. దశలవారీగా మద్య నిషేధం అమలులోకి తీసుకొస్తామని.. విరివిగా మద్యాన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాల్లో ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటివి ఎందుకు కన్పించడం లేదని.. మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్రమంత్రిని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details