Prathidwani: నాలుగేళ్లుగా ఆ మాటలు - చేతలకు పొంతన ఉందా..?
Prathidwani: ఒక అబద్దాన్ని చెప్పిందే చెప్పి.. వందల సార్లు చెప్పి.. నమ్మించే ప్రయత్నం చేస్తారు. తోడేళ్ల మాదిరి ఏకమై మోసం చేసే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో అనేక బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్న మాట ఇది. ఇదే జగన్ ప్రతిపక్ష నేతగా గతంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మరో పిలుపు.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకుల్ని కాలర్ పట్టుకు నిలదీయాలి. నాయకులు అబద్ధం చెప్పడానికి భయపడాలి. ఐతే.. ఒకవేళ ప్రతిపక్షాలు, మీడియా నిలదీస్తున్న ప్రశ్నలే జగన్‌కు అబద్ధాలు, గోబెల్స్ ప్రచారంలా కనిపిస్తూ ఉంటే.. నాలుగేళ్లుగా ఆయన మాటలు - చేతలకు మధ్య పొంతనకు ఏం పేరు పెట్టాలి ? అభివృద్ధి, సంక్షేమం, హామీల అమలుపై ప్రజలు అబద్దాలు, మోసాలు దాటి వాస్తవాలు తెలుసుకోవాలంటే ఎలా ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ. ఈ చర్చలో సీనియర్ పాత్రికేయులు గోశాల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరం తరపున నేతి మహేశ్వరరావులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.