ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani: హామీల అమలు కోసం.. అంగన్వాడీల ఆందోళన బాట

By

Published : Jul 11, 2023, 10:22 PM IST

Updated : Jul 11, 2023, 10:30 PM IST

Anganwadis protest

Prathidwani: హామీల అమలు కోసం మరోసారి రాష్ట్రంలో ఆందోళన బాట పట్టారు అంగన్‌వాడీ వర్కర్లు. పాదయాత్రలో, ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు... నేటి సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్నామని కదం తొక్కారు. ఇచ్చిన మాట మేరకు ఉద్యోగ భద్రత.. కనీస వేతనం పెంపు, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలూ అందించాలని అభ్యర్థించారు. ఎప్పటి నుంచో చేస్తున్న ఈ విన్నపాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక పోవడానికి తోడు.. కొంత కాలంగా పెరిగిన వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది ? అంగన్‌వాడీల సమస్యలేంటి ? వారికి జగన్ అసలు ఏం చెప్పారు ? ఏం చేశారు ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఏపీ అంగన్‌వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు బి. లలిత, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్​లు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.  

Last Updated : Jul 11, 2023, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details