ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనం లేక వెలవెలబోయిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర - వీడియో వైరల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 9:03 PM IST

ysrcp_bus_trip

People Not Responding YSRCP Samajika Sadhikaratha Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన 'సామాజిక సాధికార బస్సు యాత్ర'కు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఏ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసినా జనాలు లేక ఆ సభ వెలవెలబోతోంది. అంతేకాదు, సభలో వైసీపీ నాయకులు ప్రసంగిస్తుండగానే ప్రజలు సభ నుంచి వెళ్లిపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వటం హాట్ టాపిక్‌గా మారింది.

YCP Leaders Fire on Opposition: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీలు గోరంట్ల మాధవ్, సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రసంగిస్తుండగా సభలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. సభ కోసం పది రోజులుగా వైసీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైసీపీ నాయకులు అసహనానికి లోనై,  ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details