ఆంధ్రప్రదేశ్

andhra pradesh

National leaders condemn Chandrababu arrest చంద్రబాబుకు మద్ధతు ప్రకటించిన పలు జాతీయపార్టీలు.. లోకేశ్​తో భేటీలో పలు కీలక అంశాలపై చర్చ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 6:37 PM IST

National leaders condemn arrest of Chandrababu

National leaders condemn Chandrababu arrest స్కిల్ డెవలప్ మెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా... జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ దిల్లీలో మద్దతుకుడగడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ వివిధ మార్గాల ద్వారా జాతీయ స్థాయిలో చర్చలు జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా...  త‌ప్పుడు కేసులో అక్రమంగా అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప‌క్షాన వివిధ  పార్టీ నేతలు స్పందించారు. చంద్రబాబు కోసం  చేస్తున్న న్యాయ‌పోరాటానికి త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని వివిధ జాతీయ పార్టీల నేత‌లు ప్రక‌టించారు. ఈ మేరకు  నారా లోకేశ్​ని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వార్ డ్యానిష్ ఆలీ, రితేష్ పాండేలు కలిసి ప‌రామ‌ర్శించారు. అంతిమంగా న్యాయ‌మే గెలుస్తుంద‌ని వారు స్పష్టం చేవారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలతో  తెలుగుదేశం పార్టీ రూపొందించిన బుక్ లెట్​ని జాతీయ పార్టీ నేత‌ల‌కి లోకేశ్  అంద‌జేశారు. అనంతరం రాష్ణ్రంలో జరుగుతున్న అక్రమ అరెస్ట్ లపై వారికి వివరించారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి తమకు మద్ధతుతెలిపిన ఆయా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details