ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RRR fire on Govt: 'మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అత్యంత దారుణం'

By

Published : Jul 18, 2023, 5:59 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు

MP Raghuramakrishna fire on Govt: మార్గదర్శి సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న చిట్‌లను ఆపే కుట్ర చేయడం దారుణమన్నారు. మార్గదర్శిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. ఏపీ హైకోర్టుకు మార్చాలని ప్రభుత్వం ఎందుకు కోరుతోందని ప్రశ్నించారు. విచారణను ఏపీకి మార్చాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని రఘురామ అన్నారు. 'మార్గదర్శి కొత్త చిట్స్​ని నిలిపివేయించి పాత చిట్స్​ను కూడా ఆపేయాలని ప్రభుత్వం కోరడం ఎంత వరకు సమంజసం. ఒక్కరు కూడా కంప్లయింట్ ఇవ్వకుండా రన్నింగ్ చిట్స్​ను ఎలా నిలిపేస్తారు. అక్రమాలు జరగకున్నా.. భవిష్యత్​లో ఇబ్బందులు ఎదురైతే అని సందేహించి నిలిపేస్తే ఎలా..? ఎవరైనా చందాదారులు తమ ఆర్థిక అత్యవసర అవసరాల కోసం చిట్టీ వేసి ఉంటే.. దానిని అర్ధాంతరంగా నిలిపేస్తే ఎలా..? ఏ అధికారం ఉందని ఇలా చేస్తున్నారు.. చిట్ పాడుకొనే అవకాశం లేక చందాదారులంతా బలైపోవాలా..? ' అని రఘురామ ప్రశ్నించారు. 

ABOUT THE AUTHOR

...view details