ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ 'బిల్డప్​ బాబాయ్' - మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప కూడా దాటడంలేదు : లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 1:12 PM IST

lokesh_on_jagan

Nara Lokesh Satires on CM Jagan Comments:సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేేశ్​వ్యంగ్యాస్త్రాలు కురిపించాడు. ఆయన చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం గడప కూడా దాటడంలేదని ఎద్దేవా చేశారు. సొంత ఇలాఖా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి వేల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అయిదేళ్లు కావొస్తున్నా అతీగతీ లేదని దుయ్యబట్టారు. తన మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తే జబర్దస్త్‌లో బిల్డప్ బాబాయి గుర్తొస్తారని లోకేశ్​ విమర్శించారు. 

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో మొదట ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్ పరిశ్రమ పారిపోయిందన్నారు. దీంతో జేఎస్​డబ్ల్యూ అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం శంకుస్థాపన చేశాడన్నారు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పరారయ్యాడని లోకేేశ్​ పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details