ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సాయం చేయండి'.. కొడుకు వైద్యం కోసం సీఎం కాన్వాయ్ వెంట తల్లి పరుగులు

By

Published : Jun 12, 2023, 9:32 PM IST

Etv Bharat

mother ran along with CM convoy:  పల్నాడు జిల్లా క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా.. ఓ తల్లి తన కుమారుడి వైద్యం కోసం సీఎంతో తన గోడును వెళ్లబోసుకునే ప్రయత్నం చేసింది.  సీఎంకు తన కుమారుడి సమస్యను చెప్పి వైద్య సహాయం చేయాలని అడిగేందుకు ప్రయత్నంచింది. అందుకోసం సీఎం జగన్ కాన్వాయికి వెంట పరిగెత్తే ప్రయత్నం చేసింది.  ముఖ్యమంత్రి కాన్వాయ్​కి ఎదురెళ్లి తన కుమారుడి అనారోగ్య సమస్యను విన్పించే ప్రయత్నం చేసింది ఆ తల్లి. 

చేయి విరిగిన తన పిల్లాడిని తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే సరైన వైద్యం అందలేదని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కుమారుడి సమస్యను వినిపించాలని ఆమె ప్రయత్నించినప్పటికీ.. కాన్వాయ్ దాటిపోయింది. ఇది గమనించిన సీఎం భద్రతా సిబ్భంది ఆమెను సీఎంను కలిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎం కాన్వాయ్​లోని భద్రతా సిబ్బంది వారిద్దరినీ వాహనంలో తీసుకెళ్లారు. తన ఒక్కగానొక్క కుమారుడికి వైద్యం చేయించాలని అందుకోసమే సీఎంను కలిసే ప్రయత్నం చేసినట్లుగా ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతూ వెల్లడించింది. 

ABOUT THE AUTHOR

...view details