ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Perni Nani on Eluru Collector: 'ఆ కలెక్టర్ నియంత అనుకుంటున్నాడా?' మంత్రి పేర్ని నాని వార్నింగ్

By

Published : Jul 19, 2023, 5:48 PM IST

Updated : Jul 19, 2023, 7:52 PM IST

ఏలూరు జిల్లా కలెక్టర్​పై పేర్ని నాని ఆగ్రహం

Perni Nani Comments on Eluru Collector : ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్​ రాకపోవడంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టర్, అధికారులు సమావేశానికి రాకపోతే.. నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందే బైఠాయించి నిరసన చేస్తామని.. కలెక్టర్​కి లేఖ రాయాలని జడ్పీ చైర్​పర్సన్ ఉప్పాల హారికకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్​పై మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జడ్పీ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం కలెక్టర్​కు లేదా అని ప్రశ్నించారు. కలెక్టర్​కి సమావేశాలకు వచ్చే ఉద్దేశం లేకపోతే చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.  

"ఏలూరు జిల్లా కలెక్టర్ నియంత అనుకుంటున్నారా? సమావేశానికి రాకపోవడం ఏంటి?  తరువాత సమావేశానికి వస్తారా? రాకపోతే జడ్పీటీసీలందరితో సీఎం ఇంటి ముందు నిరసన తెలియజేస్తాం. వ్యవస్థ అంటే భయం అవసరం లేదు. గౌరవం ఉండాలి."- పేర్ని నాని, మాజీ మంత్రి

Last Updated : Jul 19, 2023, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details