ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Miserable_Situation_at_visakha_Fishing_Harbour

ETV Bharat / videos

అగ్ని ప్రమాదం జరిగి రెండురోజులైనా మారని దుస్థితి - విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద దయనీయ పరిస్థితి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 4:45 PM IST

Miserable Situation at visakha Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగి రెండు రోజులు దాటింది. ప్రమాదం జరిగిన ప్రాంతం వ్యర్థాలతో కకావికలంగా ఉంది. సముద్ర జలాలు.. కుళ్లు, డీజిల్ తో పర్యావరణానికి విఘాతంగా మారాయి. ఫలితంగా దీని పై ఆధార పడే కలాసీలు, ఉపాధి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకారులకు వేదన మిగిల్చింది. ఈ ఘటనలో 30కి పైగా బోట్లు ఆహుతయ్యాయని.. తమకు ఉపాధి ప్రశ్నార్థకమైందని జాలర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Vizag Fishing Harbour Fire Accident: బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని.. తొలుత అందులో మంటలు చెలరేగి.. కొద్దిక్షణాల్లోనే పక్క బోట్లకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ అగ్నిప్రమాదంలో 25 నుంచి 30 కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్ వద్ద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details