ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Dharmana జగన్ పాలనలో లోపాలు దిద్దుకుంటాం..! అభివృద్ధి అంటూ.. టీడీపీ చచ్చిపోతోంది: మంత్రి ధర్మాన

By

Published : Jul 4, 2023, 6:07 PM IST

మంత్రి ధర్మాన ప్రసాదరావు

Minister Dharmana Comments: జగన్మోహన్ రెడ్డి పాలనలో లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు... ప్రసార మాధ్యమాల్లో వచ్చినవి చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. శ్రీకాకుళం హ‌డ్కో కాల‌నీలో ఏర్పాటు చేసిన జ‌గ‌నన్న సుర‌క్ష కార్య‌క్ర‌మంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పెత్తనం చేయకుండా... సేవకుల్లాగా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు అభివృద్ధి, అభివృద్ధి అంటూ చచ్చిపోతున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన చెప్పిన మహిళపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కస్సుబుస్సుమన్నారు.  "గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టున్నారు... ఎన్ని ఎకరాలు కొన్నార్రా బాబు మీరు..? ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు..? మళ్లీ ఎందుకురా మీకు అధికారం.. అభివృద్ధో..అభివృద్ధో అని చచ్చిపోతున్నారు.. ఏం చేశారు." అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా.. పని చేయించుకోవాలన్నా చాలా మంది దిగులు పడుతున్నారు. తమ లాంటి వాళ్లు ఆఫీసులకు వెళ్లి పనిచేయించుకోలేమని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే జగనన్న సురక్ష చేపట్టాం. తద్వారా అధికారులే నిస్సహాయుల దగ్గరికి వెళ్లి వారు అడిగిన పని చేసి పెట్టే కార్యక్రమం రాష్ట్రం అంతటా కొనసాగుతుంది. అని మంత్రి ధర్మాన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details