ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంగన్​వాడీల జీతాలపై మేము అలా చెప్పలేదు: మంత్రి బొత్స

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 5:49 PM IST

bosta_on_-anganwadis

Minister Botsa Satyanarayana on Anganwadis salaries:రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు చేస్తోన్న ధర్నాపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. అంగన్‌వాడీల జీతాలు తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారి పెంచుతామని తమ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా అప్పట్లో తెలంగాణాలో అమల్లో ఉన్న జీతాల కంటే అదనంగా 1000 రూపాయలు పెంచుతామని చెప్పాం, ఆ ప్రకారమే అధికారంలోకి రాగానే అంగన్‌వాడీలకు రూ. 10,500 నుంచి 11,500కు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Botsa Comments: గతకొన్ని రోజులుగా అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు తమ జీతాలు పెంచాలంటూ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంగన్‌వాడీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సార్లు చర్చలు జరిపింది. కానీ, ఆ చర్చల్లో అంగన్‌వాడీల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్‌వాడీల డిమాండ్లపై మాట్లాడారు. 

''తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీల జీతాలను 2021లో పెంచింది. మా ప్రభుత్వం 2019లోనే పెంచింది. పక్క రాష్ట్రం పెంచిన ప్రతిసారి మేం పెంచుతామని మా ఎన్నికల హామీల్లో చెప్పలేదు. అంగన్‌వాడీల 11 డిమాండ్లలో ఇప్పటికే 10 డిమాండ్లను పరిష్కరించాం. గ్రాట్యుటీని సైతం రూ.50వేల నుంచి లక్ష రూపాయాలు చేశాం. జీతాలు పెంపునకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ, ఎన్నికల సమయం సమీపిస్తున్న దృష్ట్యా ఇది ఇప్పుడు సాధ్యం కాదు'' అని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details