ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ఉక్కు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 9:55 PM IST

Massive Fire Accident In Vizag Steel Plant

 Massive Fire Accident In Vizag Steel Plant:విశాఖ ఉక్కు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్‌-3లో పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై అధికారులు స్పందించారు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంత ఆస్తి నష్టం వాటిల్లింది అనే విషయాలపై ప్రాథమిక సమాచారం లేదని, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఉక్కు పరిశ్రమ అధికారులు వెల్లడించారు. అయితే, ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడటంతో బ్లాస్ట్ పర్నేస్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. గతంలో సైతం, స్టిల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు ఉన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details