ఆంధ్రప్రదేశ్

andhra pradesh

manohar_fire_on_allotment_land

ETV Bharat / videos

భూముల క్లియరెన్స్ సేల్​ చేపట్టిన వైసీపీ ప్రభుత్వం - ఆ కంపెనీలకే మళ్లీ కేటాయింపు : నాదెండ్ల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 1:58 PM IST

Manohar Fire on Allotment Lands for Industries: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకున్న కంపెనీలకే క్లియరెన్స్‌ సేల్స్‌ కింద మళ్లీ భూములు కేటాయిస్తోందని జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కొత్త పారిశ్రామిక విధానం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో ప్రభుత్వమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఒప్పందాలను రద్దు చేసుకున్న కంపెనీలకే మళ్లీ భూములు కేటాయించడం వెనకున్న రహస్యాలను రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని మంత్రి వర్గాన్ని ఆయన కోరారు.

Janasena PAC Chairman Comments: ''గత మంత్రివర్గ సమావేశంలో అనేక కంపెనీలకు విచిత్రమైన స్పెషల్‌ ప్యాకేజీలు ఇచ్చారు. రిటైల్‌ స్టోర్‌ మూసేసే ముందు క్లియరెన్స్‌ సేల్‌ పెడతారు. 70, 80 పర్సంట్‌ అని చెబుతుంటారు. ఉన్నవన్నీ అమ్మేసి దుకాణం మూసేస్తున్నామని మార్కెటింగ్‌ చేస్తుంటారు. ప్రభుత్వం కూడా క్లియరెన్స్‌ సేల్‌ మొదలుపెట్టింది. నవంబర్‌ 3న అనేక పరిశ్రమలకు భూకేటాయింపులు విచిత్రంగా జరిగాయి. గతంలో కొన్ని కంపెనీలకు భూములు కేటాయిస్తే, వాళ్లు ఏర్పాటు చేయలేమని రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్న కంపెనీలకే క్లియరెన్స్‌ సేల్స్‌ కింద మళ్లీ భూములు కేటాయించేస్తున్నారు. ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ కొత్త పారిశ్రామిక విధానం తీసుకువచ్చారో వాళ్లే చెప్పాలి. కృష్ణపట్నం పోర్టు వద్ద రిలయన్స్ అల్ట్రా మెగా పవర్‌కి అప్పట్లో ఇచ్చిన 2,680 ఎకరాల భూమిని సేల్ డీడ్ చేయడంలో అంతర్యం ఏంటి?. ఆ భూములను ఎవరికి ఇస్తున్నారు స్పష్టం చేయాలి.'' అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details