ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Man Blackmail Minor Girl and Raped బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చటంతో వెలుగులోకి

By

Published : Aug 13, 2023, 7:42 PM IST

man_threatened_and_raped_minor_girl

Man Threatened and Raped Minor Girl: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు 9వ తరగతి చదువుతున్న బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందర్లపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. 9వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో నిందితుడిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు ఇటుక బట్టీల పనికి వేరే ప్రాంతాలకు వెళుతుంటారు. కొన్ని నెలల వరకు అక్కడే ఉండి వస్తుంటారు. ఈ సమయంలో బాలికను అదే గ్రామానికి చెందిన మాణిక్యాలరావు బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు మాణిక్యాలరావుకి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు నిందితుడు మాణిక్యాలరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనపై దాడి చేసి కొట్టారని ఆరోపిస్తూ నిందితుడు మాణిక్యాలరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details