ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీకి షాక్‌ ఇస్తున్న నాయకులు, కార్యకర్తలు - టీడీపీ, జనసేనలో భారీగా చేరికలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 12:32 PM IST

leaders_joined_tdp

Leaders Joined TDP and Janasena From YCP:సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి నాయకులు, కార్యకర్తలు షాక్‌ ఇస్తున్నారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిధిలోని మూడవ సచివాలయం వైసీపీ  కన్వీనర్‌, 19వ వార్డు ఇన్‌ఛార్జ్‌లు తమ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. 

నరసాపురం మండలం మర్రితిప్పకి చెందిన వైసీపీ నాయకుడు చిమ్మిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది వైసీపీ శ్రేణులు జనసేన పార్టీలో చేరారు. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. కురుకుంద గ్రామానికి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. నేతలు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ప్రశాంత్‌ కిషోర్​పై టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు చేశారు. ఇప్పటికీ ప్రశాంత్‌ కిషోర్‌ ఐప్యాక్‌ సంస్థ తమతోనే పనిచేస్తుందని ఎందరు పీకేలు కలిసినా జగన్‌ని ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details