Lawyers Agitation Against Chandrababu Arrest: "రాజ్యాంగ్యాన్ని గౌరవించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి".. బాబు అరెస్టుపై నిరసన గళం విప్పిన న్యాయవాదులు..
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 5:30 PM IST
Lawyers Agitation Against Chandrababu Arrest: విశాఖ జిల్లా కోర్టు సముదాయం వద్ద చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నిరసన గళం విప్పారు. "రాజ్యాంగ్యాన్ని గౌరవించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి", "బాబుకు బెయిలు.. జగన్కు జైలు" అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టారని అరెస్టు చేసే విధానం చట్ట వ్యతిరేకంగా ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా అనే అనుమానం రేకెత్తుతుందన్నారు. కనీస సాక్ష్యాధారాలు లేకుండా సెక్షన్లు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల భవితవ్యానికి సహాయపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి మేలు చేసినటువంటి వ్యక్తిని అక్రమంగా జైల్లో కూర్చోబెట్టారని ఆగ్రహించారు. మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీఎస్ నాయుడు, విశాఖ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సుమన్, విశాఖ బార్ కౌన్సిల్ మాజీ కార్యదర్శి రమాదేవి తదితర సీనియర్ న్యాయవాదులు ప్లకార్డులు చేతబట్టి.. నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తుదకు న్యాయమే గెలుస్తుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసులన్నీ తొలగిపోతాయని అన్నారు.