ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Janasena Protest For Bypass Road in Gudivada: 'రోడ్ల మరమ్మతుల కోసం సీఎం జగన్ బటన్ నొక్కాలి'.. బైపాస్​లో జనసైనికుల జల దీక్ష

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 1:19 PM IST

Janasena_Protest_For_Bypass_Road_in_Gudivada

Janasena Protest For Bypass Road in Gudivada :కృష్ణా జిల్లా గుడివాడలో బైపాస్ రోడ్డుపై జనసైనికులు వినూత్న నిరసన చేపట్టారు. కైకలూరు నుంచి గుడివాడకు వచ్చే రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు ప్రాణాంతకంగా మారాయని, చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయని వారు ఆరోపించారు. గుంతల్లో చేరిన వర్షపు నీటిలో కూర్చొని జనసైనికులు జల దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా రోడ్ల మరమత్తులు ఎందుకు చేయటంలేదో ప్రక్షాళన చేసుకోవాలన్నారు. 

బైసాస్‌ రోడ్డుపై ప్రయాణం ప్రాణాంతకంగా మారిందని, ఈ మార్గంలో ప్రయాణించేందుకు వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులైతే ఫీట్లు చేయాల్సి వస్తోందని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలు, భారీ వాహనాలు సైతం గుంతల్లో ఇరుక్కుపోతుండడంతో రాత్రి పూట ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు భీతిల్లిపోతున్నారు. ఈ రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయన్నారు. ప్రాణాంతకంగా మారిన కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డు ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని జనసైనికులు అన్నారు. సీఎం జగన్ రోడ్ల మరమ్మతుల కోసం కూడా బటన్ నొక్కాలని ఈ సందర్భంగా జనసైనికులు నినాదాలు చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకుంటే ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమిస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details