ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'బొంతు మహేంద్రది ఆత్మహత్య కాదు' దళితుడి హత్య కేసులో హోంమంత్రిని ఏ1గా చేర్చాలి : జవహర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 12:26 PM IST

Home_Minister_is_Cause_of_Mahendra_Death

Home Minister is Cause of Mahendra Death: దళితుడు బొంతు మహేంద్రది ఆత్మహత్య కాదు.. హోంమంత్రి చేయించిన హత్య అని మాజీ మంత్రి కే ఎస్ జవహర్ ఆరోపించారు. జగన్  అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని మండిపడ్డారు.

Home Minister Should be Included as A1 in Mahendra Death Case: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని దొమ్మేరు  గ్రామంలో బొంత మహేంద్ర అనే దళితుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ కేసులో హోంమంత్రి తానేటి వనిత ను ఏ1 ముద్దాయిగా చేర్చాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. హోంమంత్రి ఎవరెవరికి ఫోన్‌ చేశారో.. ఎవరు ఒత్తిడి తెస్తే అతనిని అరెస్ట్ చేసి వేధించారో తెలియాలన్నారు. జగన్ హయాంలో దళిత యువకులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ బొంత మహేంద్ర హత్యను ముక్త కంఠంతో ఖండించాలన్నారు.

దొమ్మేరులో ఈ నెల 6న జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి హోంమంత్రి వస్తున్నారంటూ వైసీపీ నాయకులు  నాగరాజు, సతీశ్ ఫ్లెక్సీలు పెట్టారు. వారి ముఖాలున్న భాగాన్ని ఎవరో కత్తిరించటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేంద్రను ఎస్సై పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లి నిర్బంధించారు. అవమానం తట్టుకోలేక మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు 

ABOUT THE AUTHOR

...view details