ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యానాం పట్టణాన్ని ముంచెత్తిన వరద.. డ్రోన్‌ దృశ్యాలు

By

Published : Jul 17, 2022, 7:09 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

Flood in Yanam: మహోగ్ర గోదావరి.. మూడు దశాబ్ధాల తర్వాత లంక గ్రామాల ప్రజల్ని బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. ప్రతిఏడాది వరదలానే భావించి అక్కడే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుండి 25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో గౌతమి గోదావరి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. గోదావరి నది పరివాహక ప్రాంతమైన కాకినాడ జిల్లాలో.. అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మునుపెన్నడూ లేని విధంగా ముంపు బారిన పడింది. భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. గూడుచెదిరిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. యానాంలో వరద పరిస్థితిపై డ్రోన్​ దృశ్యాలు...
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details