ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్‌ - ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 10:05 AM IST

Gas_Cylinder_Exploded_in_Vizianagaram_District

Gas Cylinder Exploded in Vizianagaram District: విజయనగరం జిల్లా విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి అయిదుగురు  తీవ్రంగా గాయపడ్డారు. లక్కవరపుకోట మండల కేంద్రం గౌరవీధిలో తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. గ్రామానికి చెందిన కేసు శ్రావణి, ఆమె కుమారుడు మోహన్, కుమార్తె లాస్యతో పాటు.. శ్రావణి తల్లి వెంకటలక్ష్మి, సోదరుడి కుమార్తె ప్రణవి అయిదుగురు ఇంట్లో ఉన్నారు. 

అయితే శనివారం రాత్రి గ్యాస్ అయిపోవడంతో కొత్త సిలిండర్ అమర్చి.. రాత్రి అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో వెంకటలక్ష్మి లేచి లైట్ వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. పేలుడు దాటికి ఇంట్లో గోడలు కూలడంతో పాటు సమీప ఇళ్లకు స్వల్ప నష్టం చేకురింది. ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత.. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details