ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganesha Immersion Festivals 2023 in State: రాష్ట్రంలో ఘనంగా వినాయకుడి నిమజ్జనోత్సవాలు.. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 10:50 AM IST

ganesha_immersion_festivals_2023_in_state

Ganesha Immersion Festivals 2023 in State : రాష్ట్రంలో అనేక చోట్ల గణేశ్‌ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర్ ఘాట్ (Godavari Pushkar Ghat) వద్ద వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలు ఊరేగింపుగా తరలించారు. అనంతరం గోదావరి ఒడికి చేర్చారు. 

Devotees Immersed Lord Ganesha Idols in Water in AP : విశాఖలో వివిధ మండపాల నుంచి బయలు దేరిన గణనాథుడి విగ్రహాలను సాగర తీరంలో నిమజ్జనం చేశారు. మహిళలు, పిల్లలని తేడా లేకుండా అందరూ లంబోధరుడి ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన 56 అడుగుల భారీ మట్టి వినాయకుని నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్రహం ఏర్పాటు చేసిన చోటే ఫైర్ ఇంజన్ల సహాయంతో నిమజ్జనం చేశారు. తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో వినాయక నిమజ్జనం వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. 30 అడుగుల నెమలిపించ వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి 11 రోజుల పాటు పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన వేడుకలు కోలాహలంగా జరిపారు.

ABOUT THE AUTHOR

...view details