ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'గడప గడప'కు కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్​కు నిరసన సెగ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 1:35 PM IST

Gadapa_Gadapaku_Program

Gadapa Gadapaku Program: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ఏ ప్రాంతానికి వెళ్లినా నిరసన సెగ తప్పడం లేదు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వస్తున్న స్థానిక ఎమ్మెల్యే 'మా ఊరికి రావద్దు' అంటూ ఎస్సీలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

గడప గడపకు ప్రభుత్వం పర్యటనలో భాగంగా వెలిగండ్ల మండలం వెదుళ్ల చెరువు గ్రామానికి బుధవారం స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ వెళ్లారు. అయితే ఆయన వస్తున్నారన్న సమాచారం ముందుగా తెలియటంతో ఆ ప్రాంత ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీ కాలనీకి చెందిన స్థానికులతో కలిసి గ్రామ రహదారిపై ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ 'మా గ్రామానికి ఎమ్మెల్యే రావద్దు' అంటూ నినాదాలు చేశారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులపై నోరుమెదపని ఎమ్మెల్యేను తమ ఊరికి రానివ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఆందోళనతో ఎమ్మెల్యే వెదుళ్ల చెరువులోని ఎస్సీ కాలనీలో పర్యటించకుండానే వెనుదిరిగి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details