Fisherman Caught Goldfish: మత్స్యకారుడి వలలో గోల్డ్ ఫిష్.. అ'ధర'హో అంటున్న స్థానికులు
Goldfish at Antarvedi Sagara Sangamam : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఎన్నో రకాల చేపల దొరుకుతంటాయి. ఈ మత్యకారుడికి కూడా ఓ అరుదైన చేప తన వలలో చిక్కింది. ఇది చాలా అరుదైనా చేప అని మత్యకారులు అంటున్నారు. ఆ చేప పేరు చాలా మంది వినే ఉంటారు. అదే గోల్డ్ ఫిష్.. ఆ చేప ధరను విన్నా చాలా అ'ధర'హో అంటూ ఆర్చర్య వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ గోల్డ్ ఫిష్ ఎక్కడ దొరికిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండీ ఈ గోల్డ్ ఫిష్‌ను మనం చూద్దాం..
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్ఠ గోదావరిలో విశాఖపట్నం జిల్లా మత్స్యకారుడికి చేతికి అరుదైన గోల్డ్ ఫిష్ చిక్కింది. 4 కిలోల గోల్డ్ ఫిష్ ధర అ'ధర'హో అనిపించింది. సాధారణంగా ఎప్పుడూ వలకు చిక్కే చేపలు ఒకానొక సమయంలో నీటిపైకి తేలి ఈదుతూ ఉంటాయి. అదే విధంగా తేలుతూ వస్తున్న ఈ గోల్డ్ ఫిష్‌ను ఒడ్డుపై నుంచి చూసిన ఆ మత్స్యకారుడు వెంటనే ఈదుకుంటూ వెళ్లి పట్టుకుని తీసుకొచ్చాడు. ఔషదగుణాలు కలిగిన ఈ చేప (మగ చేప) విక్రయించగా ఏకంగా 16 వేల రూపాయల ధర పలికింది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ చేపలు వైద్యంలో వినియోగిస్తారని అందుకే ఇంత రేటు పలుకుతుందని వ్యాపారస్తులు తెలిపారు. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ మత్స్యకారుడి పంట పండిందని, అ'ధర'హో అంటున్నారు.