ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరవు మండలాల ప్రకటనపై వివక్షను నిరసిస్తూ భగ్గుమన్న రైతన్న - ఆందోళన ఉద్ధృతం, ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 5:05 PM IST

Updated : Nov 2, 2023, 5:12 PM IST

Farmers_Agitation_in_Kurnool_District

Farmers Agitation in Kurnool District: కర్నూలు జిల్లాలోని తుగ్గలిని కరవు మండలంగా ప్రకటించకపోవటంతో.. రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం తుగ్గలిలో రోడ్డుపై బైఠాయించి.. నినాదాలు చేశారు. తుగ్గలి మండలంలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నా.. కరవు మండలంగా ప్రకటించకపోవటం దారుణమని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.  

నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న తుగ్గలి మండలాన్ని అధికారులు ఎందుకు కరవు మండలంగా ప్రకటించలేదో అర్థం కావట్లేదని రైతులు వాపోయారు. సక్రమంగా వర్షాలు కురవక పంటలు పండకపోవడంతో రైతులు వ్యవసాయ కూలీల సైతం సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు.. తుగ్గలిని కరవు మండలంగా గుర్తించాలని.. లేదంటే తమ ఆందోళనలను విరమించే ప్రసక్తేలేదని అన్నదాతలు హెచ్చరించారు.

Last Updated : Nov 2, 2023, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details