ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాగు, సాగు నీటి సమస్యపై అధికారులతో సీఎస్ చర్చలు - కలెక్టర్లకు ఆదేశాలు జారీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 1:01 PM IST

CS Jawahar Reddy Met Officials to Solve Water Problems

CS Jawahar Reddy Met Officials to Solve Water Problems: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాగు, సాగు నీటి విషయంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యల పరిష్కారం కోసం సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలవనరులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వివిధ శాఖల అధికారులతో సీఎస్ చర్చలు జరిపారు.

Water Crisis in Rayalaseema Districts: రాయలసీమ జిల్లాలైన అనంతపురం, సత్యసాయి సహా తదితర జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాలలో నీటి సరఫరా అంశంపై వచ్చిన ప్రతిపాదనలపై సీఎస్ చర్చించారు. ఆ ప్రాంతాల్లో పండించే  పంటలకు నష్టం కలుగకుండా నీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసే అంశంపైనా కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం గురించి అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details