ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Etv Bharat

ETV Bharat / videos

CPI Leader Ramakrishna Fires on CM Jagan: జగన్​ని ఇంటికి పంపించకపోతే.. వివేకాకు పట్టిన పరిస్థితే: రామకృష్ణ

By

Published : Aug 18, 2023, 3:22 PM IST

CPI Leader RamaKrishna Fires on CM Jagan : "రాష్ట్రాన్ని రక్షించుకుందాం.. దేశాన్ని కాపాడుకుందాం" పేరిట సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర  విజయనగరం (CPI Bus Yatra in Vizianagaram) చేరుకుంది. ఈ సందర్భంగా అమర్ భవన్​లో నిర్వహించిన సభలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ  నిప్పులు చెరిగారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీశారని  మండిపడ్డారు. నాలుగేళ్ల పాలనలో ఏపీ ప్రజల్లో పూలు పెడుతూ కాలం వెళ్లదీసారే తప్పా ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, నిరుద్యోగం పెరిగిపోయిందని,.. వచ్చే ఎన్నికలో జగన్​ని ఇంటికి పంపించక పోతే వాళ్ల బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డికి జరిగిన పరిస్థితే రాష్ట్ర ప్రజలకు కూడా ఎదురవుతుందని ఆయన అన్నారు. 

"నాలుగు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క పరిశ్రమ స్థాపించలేదు. ఏ ఒక్క కాలువ తవ్వలేదు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశారు. ఎలక్షన్​లుముందుగా వస్తున్నాయని అంటున్నారు. అలా జరిగితే ముందుగానే ఇంటికి పోతాడు."- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 

ABOUT THE AUTHOR

...view details