ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chinta Mohan on YSRCP Govt About Chandrababu Arrest: చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెట్టడం దుస్సాహమైన చర్య: చింతా మోహన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 7:52 PM IST

chinta_mohan_comments_on_ycp

 Chinta Mohan on YSRCP Govt About Chandrababu Arrestతెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దుస్సాహసమే అవుతుందని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎం చేసిన వ్యక్తిని ఆధారాలు లేని కేసులో జైలుకు పంపించటం దారుణమన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయన్ను ఇన్ని రోజులు జైల్లో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకొని చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ఐపీఎస్ అధికారులు రాజకీయ నేతలుగా మారిపోయారని విమర్శించారు. ఐపీఎస్ అధికారులను చూసి పోలీస్ కానిస్టేబుళ్లు నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో విద్య, మద్యం విధానాలపై ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details