ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Children support to Chandrababu: 'భవిష్యత్​ కోసం బాబుకు అండగా ఉందాం..' ముద్దు మాటలతో ముచ్చెమటలు పట్టించారుగా..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 5:30 PM IST

Childrens

 Children support to Chandrababu: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్​కు నిరసనగా... మెుదట తెలుగు రాష్ట్రాల్లో మెుదలైన ఉద్యమం... దేశాలు దాటి ప్రపంచాన్ని తాకింది. బాబుకు మద్దతుగా మేమంటూ... తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. మరి కొంత మంది నేతలు, టిీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైల్ వద్దకు తరలి వస్తున్నారు. 

నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari ) దీక్షకు సంఘీభావం తెలుపుతూ... బాబు వెంటే మేము అంటూ ఆమెకు ధైర్యం చెప్పె ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కుల, మత, వర్ణం, వర్గాలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా... రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి చేపట్టిన సత్యమేవ జయతే పేరిట చేపట్టిన నిరాహార దీక్ష (hunger strike)లో చిన్నారులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని చిన్నారులు పిలుపునిచ్చారు. చంద్రబాబు Chandrababu) జైలు నుంచి త్వరగా బయటకు రావలని ప్రార్థన చేశారు.

ABOUT THE AUTHOR

...view details