ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు బైక్​లను ఢీకొని ఈడ్చుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, మరొక యువకుడి పరిస్థితి విషమం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 9:53 AM IST

RTC_Bus_Accident_in_Anantapur

RTC Bus Accident in Anantapur: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్​లో జరిగిన ఘటన మరువకముందే అనంతపురంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద రెండు వేరు వేరు బైక్​లపై వెళ్తున్న యువకులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెహబూబ్ బాషా, సయ్యద్ బాషా అనే ఇద్దరు యువకులు వేరువేరు బైకుల్లో నగరంలోకి వస్తున్నారు. 

RTC Bus Hit Two Bikes: అదే సమయంలో ధర్మవరం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద రెండు వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు.. బస్సు టైర్ల కింద పడ్డారు. దాదాపు 60 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకుంటూ వెళ్లింది. తీవ్రంగా గాయపడిన సయ్యద్ బాషా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details