ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Forest officials in Coffe godowns నర్సీపట్నం కాఫీ, మిరియాల గోదాములను తనిఖీ చేసిన అటవీ శాఖ అధికారి

By

Published : Jul 21, 2023, 6:36 PM IST

COFEE

Narsipatnam coffee and pepper godowns Visit APFDC: అనకాపల్లి జిల్లా నర్శీపట్నంలోని అటవీ శాఖకు చెందిన కాఫీ, మిరియాల గోదాములను.. శుక్రవారం రాష్ట్ర అటవీ శాఖ అధికారి నయనార్ శ్రీనివాసులు పరిశీలించారు. పరిశీలనలో భాగంగా గోదాముల్లో నిల్వ ఉన్న కాఫీ, మిరియాలపై ఆయన ఆరా తీశారు. కాఫీలోని రకాలు, పండించే విధానం గురించి తెలుసుకున్నారు. అనంతరం కాఫీ శుద్ది చేసే మిషనరీ యంత్రాల సామర్థ్యం పెంచేందుకు అక్కడి సిబ్బందిని సంప్రదించారు. మన్యం నుంచి కాఫీ దిగుమతుల ఉత్పత్తుల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో రాష్ట్ర అటవీ శాఖ అధికారి నయనార్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ''ఈరోజు నర్సీపట్నంలోని కాఫీ ప్లాంట్ దానికి సంబంధించిన మిషనరీలను పరిశీలించాము. పరిశీలనలో కాఫీ రకాలు, వాటి నాణ్యత, కాఫీ విత్తనాలను గురించి పరీక్షించాము. అందులో ఏ, బీ,సీ,డీ అనే నాలుగు రకాల విత్తనాలు ఉన్నట్లు తెలుసుకున్నాం. ఈ కాఫీ ప్లాంట్‌లో సిబ్బంది కొరత ఉన్నది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం.'' అని అధికారి వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details