ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన అంబులెన్స్ - పలువురికి గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 9:40 PM IST

ambulance_overturned_due_to_dense_fog

Ambulance Overturned Due to Dense Fog: పొగమంచు కారణంగా వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఏమీ కనిపించని పరిస్థితుల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పేషెంట్​తో వెళ్తున్న అంబులెన్స్ ఒక్కసారిగా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో పలువురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో పెదపూడి వంతెన వద్ద అదుపు తప్పి 108 అంబులెన్స్ కాలువలోకి దూసుకెళ్లింది. 

నిజాంపట్నం మండలం గోకర్ణ మఠంలో పేషంట్​ను ఎక్కించుకుని 108 వాహనం తెనాలి వైపు వెళ్తోంది. గోకర్ణ మఠం నుంచి బాధితుడిని తరలిస్తుండగా మంచు అధికంగా ఉండటంతో, ఇబ్బంది కారణంగా పెదపూడి వంతెన వద్ద అంబులెన్స్ వాహనం అదుపు తప్పి, ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా, టెక్నీషియన్ సురేష్‌కి పక్కటెముకులు విరగడంతో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అంబులెన్స్ డ్రైవర్ సమీపంలోని మరో 108కి  ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో 108 వాహనాన్ని బయటికి తీశారు.

ABOUT THE AUTHOR

...view details