ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amaravati Farmers Celebrations over CBN Interim Bail: చంద్రన్న మధ్యంతర బెయిల్​.. టపాసులు పేల్చుతూ అమరావతి రైతుల సంబరాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 3:48 PM IST

Amaravati_Farmers_Celebrations_over_CBN_Interim_Bail

Amaravati Farmers Celebrations over CBN Interim Bail: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ లభించడంతో రాష్ట్రంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు.. టపాసులు పేల్చుతూ సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్​పై రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నినాదాలు చేశారు. 'న్యాయం గెలిచింది' అంటూ దీక్షా శిబిరంలో మహిళలు నినదించారు. 

TDP Leaders Celebrations in Mangalagiri: మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. చంద్రబాబును ఇక ఏ శక్తి ఆపలేదని అన్నారు. అన్ని కేసులు అక్రమం అని త్వరలోనే తేలిపోతాయని.. టీడీపీ నేతలు అన్నారు. కాగా ఈరోజు సాయంత్రమే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి చంద్రబాబు.. భారీ ర్యాలితో అమరావతి చేరుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details