ఆంధ్రప్రదేశ్

andhra pradesh

117 feet Ganesh idol in Gajuwaka: 117 అడుగుల భారీ గణనాథుడు.. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌.. ప్రతిష్ఠించిన దగ్గరే నిమజ్జనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 12:08 PM IST

anesha_idol_immersion

117 feet Ganesha idol Immersion in Gajuwaka:విశాఖ గాజువాకలోని లంకా మైదానంలో గత 21 రోజులుగా పూజలు అందుకుంటున్న భారీ వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా వచ్చారు. ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. సాయంత్రం పురోహితుల సంప్రదాయ పూజల అనంతరం అగ్నిమాపక వాహనాలతో పంచామృతాలు కలిపిన నీటితో ప్రతిష్ఠించిన చోటే నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. 

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌... భారీ విగ్రహానికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధికార ప్రతినిధి చేతుల మీదుగా ఉత్సవ నిర్వాహకులకు బంగారు పతకం, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఎస్‌వీ ఎంటర్‌ టైన్‌మెంట్ ప్రతిష్టించిన 117 అడుగుల వినాయకుడు 21 రోజులు పాటు పూజలందుకున్నాడు. మహాగణపతి 117 కేజీల లడ్డూను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యురాలు నిర్మలా చిన్ని.. 11 లక్షల 116 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. స్వామి ధరించిన ముత్యాలహారం లక్షా 50 వేలకు పాడారు.

ABOUT THE AUTHOR

...view details