ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amaravathi: మూడో రోజు కొనసాగుతున్న.. అమరావతి రైతులు మహాపాదయాత్ర

By

Published : Nov 3, 2021, 12:30 PM IST

Updated : Nov 3, 2021, 2:19 PM IST

అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. గుంటూరు నగరంలో సాగుతున్న పాదయాత్రకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు పలికారు. హారతులిచ్చి పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని తమ అభిమతాన్ని తెలియజేస్తున్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. గుంటూరు నగరంలోని అమరావతి రోడ్ నుంచి ఇవాళ్టి పాదయాత్ర ప్రారంభమైంది. రాజధాని రైతులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. "అమరావతిని రక్షించుకుందాం ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం" అంటూ నినాదాలు చేస్తూ రైతులు ముందుకు సాగుతున్నారు. తిరుమల వరకు సాగే ఈ పాదయాత్రతో.. ప్రభుత్వం కళ్లు తెరుచుకుంటాయని వారు ఆశాభావంతో ఉన్నారు.
Last Updated : Nov 3, 2021, 2:19 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details