ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crime News: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్​.. ఇద్దరు మృతి

By

Published : Feb 11, 2022, 2:32 AM IST

Nandimandalam Road Accident: కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం వద్ద ఆగిఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

bike hit by lorry in kadapa district
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two Persons Died in Accident at Kadapa District: కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నందిమండలానికి చెందిన రమణ, మస్తాన్ వలీ.. బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వాళ్లిద్దరూ పని ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నందిమండలం సమీపంలో ఆగి ఉన్న లారీని బైకు ఢీకొనడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. రాత్రి కావడంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టారని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details