కడప జిల్లాలో..
కడపలో రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు భారీ వర్షం కురిసింది. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరింది. ఆర్టీసీ గ్యారేజ్‌లోకి నీరు వచ్చింది. కార్మికులు నీటిలోనే విధులు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేద్కర్ కూడలి, గురుకుల్ విద్యాపీట్, అప్సర కూడలి, ఎన్జీవో కాలనీ, గంజికుంట కాలనీ, శివానంద పురం, కుమ్మరి కుంట తదితర కాలనీలు జలమయం అయ్యాయి. శివానంద పురంలో రెండు ఇల్లు కూలడంతో ప్రమాదం తప్పింది. లోతట్టుప్రాంతాలన్నీ జలమయం కాగా..స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి ఒక్కసారిగా దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షానికి కురవడంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. మురుగు కాల్వల సక్రమంగా లేకపోవడంతో రోడ్ల పైనే నీరు నిలిచింది. నగరపాలక అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మైదుకూరులో..