ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP Vs BJP: కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధం: రాచమల్లు శివప్రసాద్​రెడ్డి

By

Published : Aug 2, 2021, 5:25 PM IST

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యేపై విష్ణువర్ధన్​రెడ్డి అనేక ఆరోపణలు చేయగా... వాటిని శివప్రసాద్​రెడ్డి ఖండించారు. అవన్నీ అవాస్తవలైతే కాణిపాకంలో ప్రమాణం చేయాలని భాజపా నేత సవాల్​ చేయగా.. దానికి ఎమ్మెల్యే సై అన్నారు.

produttur mla rachamallu shivaprasad reddy and bjp leader vishnuvardhan reddy challenges each other
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాళ్లు


భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని విష్ణువర్ధన్​ రెడ్డి ఆరోపించారు. దీంతోపాటు రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఇటీవల జరిగిన ఇరువర్గాల ఘర్షణ, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బెదిరింపు కాల్స్​లో ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. అవన్నీ అవాస్తవమైతే కాణిపాకంలో ఎమ్మెల్యే ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు.. విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాళ్లు

ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రకటించడంతో భాజపా నేత విష్ణువర్ధన్​రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details