ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అదుపుతప్పి ఆటో బోల్తా... ఒకరు మృతి

By

Published : Apr 9, 2021, 8:58 PM IST

కడప జిల్లా చిన్నపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఆదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను కడప రిమ్స్​కు తరలించారు.

one man died in a road accident at kadapa district
అదుపుతప్పి ఆటో బోల్తా... ఒకరు మృతి

కడప జిల్లా కమలాపురం మండలం చిన్నపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో.. చికిత్స కోసం కడప రిమ్స్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బోగాధి అనే వ్యక్తి మృతి చెందాడు.

గాయాలపాలైన వారందరూ వీరపునాయునిపల్లె మండలం అలిదినె, ఓబాయపల్లి గ్రామానికి చెందినవారుగా స్థానికులు గుర్తించారు. వీరందరూ ఆటోలో కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల పుణ్యక్షేత్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details