బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కడపలో ఉదయం నుంచి ఓ మోస్తరుగా వాన కురుస్తూనే ఉంది. నగరంలో మురికి కాల్వల పనులు జరుగుతుండటంతో వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై పారుతోంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో నమోదైన వర్షపాతం కారణంగా జలాశయాల్లో పూర్తిస్థాయి నీటి మట్టం దాటింది. మరో మూడు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు బుగ్గవంక ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచారు. దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరదలు వచ్చినా...ఎదుర్కొనేలా పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉన్నారు.