ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డంపింగ్ యార్డులో అగ్నిప్ర‌మాదం

By

Published : Jan 28, 2020, 11:48 AM IST

క‌డ‌ప జిల్లా గోప‌వ‌రం పంచాయ‌తీ ప‌రిధిలోని పుర‌పాలిక డంపింగ్ యార్డులో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై పుర‌పాలక అధికారుల‌కు స‌మాచారం అందించినా ఆల‌స్యంగా స్పందించారు. దీంతో చిన్న ప్రమాదం కాస్తా పెద్దదైందని స్ధానికులు పేర్కొన్నారు.

fire accident in gopavaram damping yard
క‌డ‌ప జిల్లా గోప‌వ‌రం డంపింగ్ యార్డులో అగ్నిప్ర‌మాదం

క‌డ‌ప జిల్లా గోప‌వ‌రం డంపింగ్ యార్డులో అగ్నిప్ర‌మాదం

క‌డ‌ప జిల్లా గోప‌వ‌రం పంచాయ‌తీ ప‌రిధిలోని పుర‌పాలిక డంపింగ్ యార్డులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. గుర్తు తెలియని వ్య‌క్తులు సిగ‌రేట్ తాగి ప‌డేయ‌డంతో అగ్నిప్ర‌మాదం జ‌రిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై పుర‌పాలక అధికారుల‌కు స‌మాచారం అందించినా ఆల‌స్యంగా స్పందించారు. అప్ప‌టికే చాలా వ‌ర‌కూ చెత్త త‌గ‌ల‌బడి ద‌ట్ట‌మైన పొగలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున చెత్త త‌గలబ‌డ‌టంతో మంట‌ల‌ను అదుపుచేయడం కష్టంగా మారింది. పుర‌పాలక అధికారులు స‌కాలంలో స్పందించ‌క‌పోవ‌డంతో చిన్న‌పాటి మంట‌లు పెద్ద‌గా వ్యాపించాయని రైతులు మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details