ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రంజాన్ పండుగను ఇళ్లలోనే జరుపుకోండి: ఉపముఖ్యమంత్రి

By

Published : May 24, 2020, 5:35 PM IST

ముస్లిం సోదరులు అందరూ వారివారి నివాసాల్లోనే రంజాన్ పండుగను జరుపుకోవాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కోరారు. కరోనా వైరస్ నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్నారు.

Deputy CM amzad basha press meet over ramzan
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

లాక్​డౌన్ కారణంగా ముస్లిం సోదరులు అందరూ వారివారి నివాసాల్లోనే రంజాన్ పండుగను జరుపుకోవాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేసుకోవడం లాంటివి చేయవద్దని కోరారు. దానధర్మాలకు ప్రతీక రంజాన్ పండుగ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో రంజాన్ పండుగ జరుపుకోవడం బాధగా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా 90 శాతం మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. కరోనా వైరస్ నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details