ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యువతి అనుమానాస్పద మృతి .. షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని తెలిపిన తండ్రి...

By

Published : Nov 12, 2022, 4:58 PM IST

young woman died under suspicious: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురంలో యువతి మృతి కలకలం రేపింది. నిద్రిస్తున్న సమయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు ఆమె తండ్రి పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Woman Suspicious death
యువతి అనుమానాస్పద మృతి

యువతి అనుమానాస్పద మృతి

Woman Suspicious death: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురంలో యువతి అనుమానాస్పద స్థితోలో మృతి చెందింది. ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్‌ కుమార్తె హారిక.. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. గత రాత్రి తన పడకగదిలో నిద్రించిన ఆమె.. పూర్తిగా కాలిపోయి మృతిచెంది కనిపించింది. శ్రీనివాస్‌కు మొదటి భార్య కుమార్తె హారిక. ఆయన మొదటి భార్య కొంతకాలం క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత రూప అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో రూప.. మరో గదిలో నిద్రిస్తున్నట్లు చెప్పారని.. పోలీసులు తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని.. యువతి తండ్రి శ్రీనివాసరావు.. వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details