ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విత్తన ఉత్పత్తి, సరఫరాలో జిల్లాకు రెండో స్థానం

By

Published : Jun 14, 2021, 9:23 AM IST

విత్తనాల ఉత్పత్తి, పంపిణీలో పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ప్రత్యేకతను చాటుకుంటుంది. రైతు సేవలో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానాన్ని సంపాదించుకుంది.

seeds
seeds

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పశ్చిమగోదావరి జిల్లా శాఖ 1973 సంవత్సరంలో ఆవిర్భవించింది. నాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. రైతుల సహకారంతో సేవలో మమేకమైంది. సంస్థకు జిల్లాలో తణుకు మార్టేరులలో విత్తన శుద్ధి కర్మాగారాలు ఉండగా.. ఈ రెండింటితో పాటు ఏలూరు కార్యాలయం ద్వారా మార్కెటింగ్ జరుపుతున్నారు. రబీ సీజన్లో 2150 ఎకరాలు, ఖరీఫ్ సీజన్లో 600 ఎకరాలలోనూ రైతుల ద్వారా రెండు సీజన్లలో విత్తనోత్పత్తి చేస్తున్నారు. సుమారు 45 వేల క్వింటాళ్ల విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందజేస్తున్నారు. విత్తనాలు పండించే రైతులకు పంటకాలంలో తగిన సూచనలు సాంకేతిక సలహాలు అందజేస్తూ రైతులకు బాసటగా నిలుస్తున్నారు.

సంస్థ ద్వారా తమకు అదనపు ఆదాయాలు లభిస్తున్నాయని రైతులు అంటున్నారు. పంట కాలంలో సహకారంతో పాటు విత్తనాలు సరఫరా చేసిన వెంటనే సకాలంలో చెల్లింపులు చేయడంవల్ల తాము సంవత్సరాల తరబడి విత్తనాలు పండించి సరఫరా చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. సంస్థ తాము రైతుల ద్వారా పండించిన విత్తనాన్ని స్థానిక రైతులకు సరఫరా చేయడంతోపాటు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడం విశేషం.

జిల్లాలో 75 శాతం మంది రైతులు విత్తనం పండించిన రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంటే 14 శాతం మంది రైతులు ప్రైవేటు డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు 11 శాతం మంది రైతులు మాత్రమే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ విత్తన ఉత్పత్తిలో సరఫరాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తర్వాత పశ్చిమగోదావరి జిల్లా శాఖ రెండో స్థానం ఆక్రమించడం విశేషం. జిల్లాలో ఉత్పత్తయిన విత్తనాలను ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలతోపాటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు కూడా సరఫరా చేస్తున్నట్లు సంస్థ అధికారులు వివరిస్తున్నారు.

ఇదీ చదవండి:

Polavaram: పోలవరంపై నేడు దిల్లీలో భేటీ..హస్తినకు జలవనరులశాఖ అధికారులు!

ABOUT THE AUTHOR

...view details