ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు దుర్మరణం

By

Published : Apr 1, 2021, 2:43 PM IST

శ్రీకాకుళానికి చెందిన బస్సు యాత్రలు ముగించుకొని తిరుగు ప్రయాణమైన సమయంలో.. అలంపురం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. హైవే పక్కన నిలుచున్న వృద్ధుడిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

Road accident on national highway Old man dead
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన బస్సు యాత్రలు ముగించుకుని తిరిగి ప్రయాణమైన సమయంలో.. అలంపురం దాబా దగ్గర నిలిపారు. బస్సు ఆగిన సమయంలో.. యాత్రికుడు బస్సులోంచి దిగి హైవే పక్కన నిలుచున్నాడు.

అటువైపు వేగంగా వచ్చిన లారీ.. హైవే ప్రక్కన నిలుచున్న (65) సంవత్సరాల పొన్నాడ ఎర్రయ్య అనే వృద్దుడిని ఢీకొట్టింది. వృద్ధుడు లారీ కింద చిక్కుకుని ఉండగా.. అలాగే చాలాదూరంపాటు లారీ లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో వృద్ధుడి కాళ్లు రెండు ఛిద్రమైపోయాయి. సంఘటనా స్థలంలోనే వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. ఆపకుండా వెళ్ళిపోయాడు. పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details