ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపండి'

By

Published : Jul 10, 2021, 3:40 PM IST

Updated : Jul 10, 2021, 6:34 PM IST

పోలవరం నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు ప్రాజెక్టు పనులు నిలుపుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం 100 శాతం నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

సీపీఎం మధు
సీపీఎం మధు

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేసేవరకు నిర్మాణ పనులు ఆపేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వల్ల 8 మండలాల్లోని 300కు పైగా గ్రామాలు శాశ్వతంగా నీట మునిగిపోతాయని.. ఈ గ్రామాల్లోని 70వేల కుటుంబాలకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదని ఆరోపించారు.

పరిహారం ఇవ్వకుండా..కాఫర్ డ్యామ్ పూర్తిచేసి గ్రామాలను జలసమాధి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహాయంతో నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని..తక్షణమే నిర్బంధ చర్యలు ఆపాలని కోరారు. ఈనెల 16వ తేదీన నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తామని మధు ప్రకటించారు.

ఇదీ చదవండి:
Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం

Last Updated :Jul 10, 2021, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details