ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP PROTEST: రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన చింతమనేని.. అడ్డుకున్న పోలీసులు!

By

Published : Jul 24, 2021, 12:02 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రాపురం వద్ద రోడ్డు మరమ్మతు పనులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేపట్టారు. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని వారించారు. మరమ్మతుల కోసం తెచ్చిన కంకరమట్టి ట్రాక్టర్లను పోలీసులు వెనక్కు పంపారు. ప్రభుత్వానికి కనువిప్పు కోసమే స్వచ్ఛందంగా ఈ చర్యకు దిగినట్టు చింతమనేని తెలిపారు.

chintamaneni
chintamaneni

రోడ్డు మరమ్మతు పనులు చేపట్టిన చింతమనేని.. అడ్డుకున్న పోలీసులు

వర్షాలకు దెబ్బతిన్న రహదారులను స్వచ్ఛందంగా మరమ్మతు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. చింతలపూడి మండలం రామచంద్రాపురం వద్ద రహదారి గోతులమయం కావడంపై.. చింతమనేని ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి మరమ్మతులు చేపట్టారు. ట్రాక్టర్ల ద్వారా కంకర మట్టిని తీసుకొచ్చారు.

అయితే.. పనులు చేయడానికి వీల్లేదంటూ.. పోలీసులు అడ్డుకున్నారు. గోతులు పూడ్చేందుకు తెచ్చిన కంకరమట్టిని, ట్రాక్టర్లను వెనక్కి పంపారు. ఏలూరు, చింతలపూడి రహదారిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా స్వచ్ఛందంగా మరమ్మతు చేస్తుంటే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని చింతమనేని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details